BHNG: యాదాద్రి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చక స్వాములు చలివేందుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా సత్యనారాయణ వ్రతాలు


