హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట దేవస్థానాన శనివారం ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ.35,27,452 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తుల్లో 1,152 మంది తలనీలాలు సమర్పించారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.10,09,050, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.8,50,000, వాహన ప్రవేశం ద్వారా రూ.3,83,500 ఆదాయం ఇతర కార్యక్రమాల ద్వారా మిగతా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.