ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ (శరద్ పవార్) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులకు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇండి కూటమి పార్టీలు శనివారం సమావేశం కానున్నాయి. అయితే, కూటమి నిర్ణయంతో సంబంధం లేకుండా NCP (SP) ఈ ప్రకటన చేయడం గమనార్హం.
వార్తలు
డీలిమిటేషన్‌కు మద్దతు ప్రకటించిన ఎన్సీపీ (ఎస్పీ)


