హైదరాబాద్: 28°C
వార్తలు

శివసేన ఎంపీలకు విప్ జారీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. నవంబర్ 29లోపు ఎంపీలందరూ ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశించింది. నవంబర్ 30 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతకుముందు నవంబర్ 28న ముంబైలో షిండే అధ్యక్షతన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ప్రత్యేక సమావేశం జరగనుంది.