హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సమస్యల పరిష్కారానికే 'భూ భారతి': కలెక్టర్

SDPT: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం 'భూ భారతి' రీ-సర్వే చేపట్టిందని కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. గజ్వేల్ మండలం కోమటిబండ, వర్గల్ మండలం సింగాయపల్లిలో సర్వేను పరిశీలించిన ఆమె, సందేహాలుంటే రీ-వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. అలాగే, ఎల్‌నినో దృష్ట్యా నీటి కొరత ఉంటుందని, రబీలో వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించారు.