హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్ ఎమ్మెల్యే అరెస్ట్

HYD: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వికలాంగులకు ఆర్థిక సాయం, మహిళలకు శిక్షణ అందించే కార్యక్రమాలకు వెళ్లకుండా నిర్బంధించడంపై ఎమ్మెల్యే అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.