హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా పథకం నమోదు ప్రక్రియ పరిశీలనలో MPDO

BHNG: వలిగొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి పరిశీలించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా ఎంట్రీ పురోగతిని సమీక్షించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.