TPT: క్రికెట్లో తిరుమల విద్యార్థిని సత్తా చాటింది. టీటీడీ శ్రీ వేంకటేశ్వర హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న జాహ్నవి రాష్ట్రస్థాయి అండర్-15 బాలికల జట్టుకు ఎంపికైంది. ACA జట్టులో చోటు దక్కించుకున్న ఆమె తమిళనాడులో జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగనుంది. ఈ ఘనతపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గెడం కిషన్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు జాహ్నవిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
తమిళనాడు పోటీలకు తిరుమల అమ్మాయి


