KMM: మున్నేరుపై నిర్మిస్తున్న తీగల వంతెనకు పద్మశ్రీ వనజీవి రామయ్య పేరు పెట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ దివాకర టీఎస్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఖమ్మం ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వనజీవి రామయ్య పేరును కేబుల్ బ్రిడ్జికి పెట్టడం ద్వారా ఆయన సేవలు భావితరాలకు గుర్తు ఉండేలా ఉంటాయని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
వనజీవి రామయ్య పేరు పెట్టాలని వినతి


