SRCL: ఇల్లంతకుంటమండలానికి చెందిన సహారా బాధితుల సంఘం ప్రతినిధులు మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సహారా సంస్థలో డిపాజిట్ చేసిన తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని MLAను విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
సహారా బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వినతి


