హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

SDPT: హుస్నాబాద్ 132 కేవీ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా నవంబర్ 28న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీతో పాటు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలని కోరారు.