NDL: ఆళ్లగడ్డలోని దొమ్మర కాలనీ సచివాలయం పరిధిలోని బుడగ జంగాల కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి శివ చంద్రారెడ్డి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి లార్వా నిర్మూలన చర్యలు చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆళ్లగడ్డ బుడగ జంగాల కాలనీలో 'ఫ్రైడే డ్రైడే'


