ADB: తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆదిలాబాద్ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శిగా తిరుకోవెల శ్రవణ్ కుమార్ నియమితులయ్యారని జిల్లా అధ్యక్షుడు కాంబ్లే విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మండలంలో సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ సాధన కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
'సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాలి'


