MNCL: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష- 2026లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఉచిత ఇంటర్వూ గైడెన్స్ కార్యక్రమంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి తెలిపారు. 1 ఫిబ్రవరి 2027లోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. వివరాలకు 04023236112, 9059050062 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత ఇంటర్వ్యూ గైడెన్స్


