హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థులుగా తోటికోడళ్ల పోటీ

E.G: రంగంపేట మండలం వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా తోటికోడళ్లు ఆంచూరి దుర్గ, ఆంచూరి రమణమ్మలు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. శివాలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని, శివాలయ అభివృద్ధి కోసం పోటీకి సిద్ధమని ఆంచూరి దుర్గ ప్రచారం చేస్తున్నారు. ఇరువురు శివాలయం కండువాలు ధరించి ప్రచారం చేయడం విశేషం. శివాజ్ఞ ఎలా ఉంది, ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో ఆదివారం తేలనుంది.