హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గామాలపాడులో డెడ్ బాడీ కలకలం!

PLD: దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ పరిధిలోని పొలాల్లో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. గుర్తుతెలియని వ్యక్తిని కొద్ది రోజుల క్రితం హత్య చేసి, మృతదేహాన్ని పొలాల్లో పూడ్చిపెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయగా, కుళ్లిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి.