హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నర్‌కు వినతి

MBNR: పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. తెలంగాణ గవర్నర్‌కు పోస్ట్‌కార్డుల ద్వారా విజ్ఞప్తులు పంపించారు. కార్యక్రమంలో ఒప్పంద అధ్యపకులు డా. భూమయ్య, ప్రభాకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రవికుమార్, సోమేశ్వర్, శారద, గురుస్వామి పాల్గొన్నారు.