హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మలికిపురం ఎస్సై కీలక సూచనలు

కోనసీమ: మలికిపురం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని ఎస్సై మోహన్ కుమార్ సూచించారు. మండలంలో ఎన్నికల కోడ్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విజేతలు ఈ విషయాన్ని గమనించి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.