హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ

VKB: కోట్‌పల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను గ్రామ సర్పంచ్ బసమ్మ సంగయ్య స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యాబోధన, పాఠశాల పరిసరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ ఆనంద్‌రావు పాల్గొన్నారు.