హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

NRPT: ఉట్కూరు మండలం వల్లంపల్లి పాఠశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ మురుగు నీరు చేరి ప్రమాదకరంగా మారింది. విద్యుత్ ఎర్త్ వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాఠశాల సమీపంలో ఈ పరిస్థితి ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.