హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించిన MLA

ASF: కాగజ్ నగర్ మండలం నజ్రూల్ నగర్ గ్రామంలో రూ.3 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను MLA హరీశ్ బాబు శుక్రవారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ మరుగుదొడ్లు మనందరి ఆస్తి అని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామ పారిశుద్ధ్యం, ప్రజారోగ్యమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.