హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడాకారులకు టీషర్టులు అందజేసిన ఎంపీపీ

BPT: కర్లపాలెం ఏట్రవారిపాలెంలో రగ్బీ జిల్లా జట్టుకు ఎంపికైన అండర్-15 బాలబాలికలకు ఎంపీపీ చీరాల శ్రీనివాసరెడ్డి తన నివాసం వద్ద టీషర్టులు అందజేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. జిల్లా జట్టులో గ్రామానికి, మండలానికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీ మెరిసి పాల్గొన్నారు.