హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికలాంగురాలికి చేయూత పింఛన్ అందజేత

VKB: బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన వికలాంగురాలు రిత్వికకు నూతన చేయూత పింఛన్ మంజూరైంది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆమెకు మొదటి నెల పింఛన్ రూ.4,016 అందజేశారు. పింఛన్ మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు రిత్విక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.