NLG: నకిరేకల్ మండలం చందుపట్లలో శుక్రవారం రాణి రుద్రమదేవి వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రుద్రమదేవి ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.
తెలంగాణ
రుద్రమదేవికి ఎమ్మెల్యే వీరేశం నివాళులు


