PDPL: దక్షిణ మధ్య రైల్వే సిర్పూర్ కాగజ్నగర్ నుంచి కేరళలోని కొల్లాం వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. వచ్చే నెల 11, 25 తేదీల్లో ఉదయం 4 గంటలకు రైలు బయలుదేరుతుంది. రామగుండం, పెద్దపల్లి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. కేరళకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
తెలంగాణ
డిసెంబర్ 11, 25 తేదీల్లో కొల్లాంకు ప్రత్యేక రైళ్లు


