హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రగతినగర్‌లో కలుషిత నీటి సరఫరా

MDCL: ప్రగతినగర్‌లో గురువారం దాదాపు అన్ని అపార్ట్‌మెంట్లకు కలుషిత నీరు సరఫరా కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు కలుషితం కావడానికి గల కారణాలను అధికారులు వెంటనే గుర్తించి, నాణ్యత పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. కలుషిత నీటి వినియోగంతో చిన్నారులు, వృద్ధులు డయేరియా వంటి అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.