హైదరాబాద్: 28°C
తెలంగాణ

GHMCలో కాలిపోయిన కీలక బిల్లులు?

HYD: GHMCలో పూడిక తరలింపు అక్రమాల వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. గతంలో ఈ కేసులో పలువురు ఇంజినీర్లపై కేసులు నమోదవగా, తాజాగా GHMC నుంచి బదిలీ అయిన ఓ అకౌంట్స్ అధికారి పనితీరుపైనా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక బిల్లులు కాలిపోయినట్లు ప్రచారం జరుగుతుండటం నగర పాలక సంస్థలో కలకలం రేపుతోంది.