హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్ భవనానికి మంత్రి శంకుస్థాపన

RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి అడుగు పడింది. లింగారెడ్డిగూడెం శివారులో రూ.29.70 కోట్లతో, 3 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించనున్న కళాశాల భవనానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.