KNR: జమ్మికుంట మున్సిపాలిటీ 17వ వార్డులో ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఈరోజు పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకర నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ పర్యటనలో కౌన్సిలర్ మాచర్ల రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రమాదకర నిర్మాణాలను ఉపేక్షించేది లేదు'


