హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తాం'

PDPL: ఇటుక బట్టీల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల ఆధార్, ఫోన్లు లాక్కోవడం, బాలకార్మికులను పనిలో పెట్టుకోవడం, వేధించడం చేస్తే బట్టీలను తక్షణమే సీజ్ చేస్తామన్నారు. కార్మికుల పూర్తి వివరాలను పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలని ఆదేశించారు.