హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ భూముల వేలం నిలిపివేయాలి

NRML: ప్రభుత్వ భూములను కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఎంసీపీఐ(యూ) చంద్ర పుల్లారెడ్డి వర్గం నిర్మల్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖానాపూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి, వేలం నిలిపివేయకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.