MLG: వెంకటాపురం మండలం అంకన్నగూడెం శివారులో ప్రభుత్వ భూమిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న ఒక జేసీబీ, మూడు టిప్పర్లను రెవెన్యూ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అధికారుల రాకను గమనించిన అక్రమార్కులు గ్రావెల్‌ను పారబోసి పరారయ్యారు. వాహనాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ నేతాజీ తెలిపారు.
తెలంగాణ
అక్రమంగా గ్రావెల్ తరలింపు


