హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంచికచర్ల అభివృద్ధికి అల్లాడి కోటేశ్వరరావు హామీ

NTR: కంచికచర్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అల్లాడి కోటేశ్వరరావు శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆశీస్సులతో పోటీ చేస్తున్నానని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించి, కంచికచర్లను సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.