RR: బోదునంపల్లిలో నెలకొన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలో విద్యుత్ ఇబ్బందులను సర్పంచ్ నాగేశ్వర్ షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లకు బుష్‌లు అమర్చేలా చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎమ్మెల్యే చొరవతో విద్యుత్ సమస్యకు చెక్


