హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లెలో టీడీపీ ఎన్నికల ప్రచారం

KDP: వేంపల్లె పట్టణంలో TDP నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. TDP మద్దతుతో పోటీ చేస్తున్న మొండోడు గౌస్ బాబాను ప్రజలు ఆదరించి గెలిపించాలని మండల పరిశీలకులు రఘునాథ్ రెడ్డి కోరారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. కడప పార్లమెంట్ TDP ప్రధాన కార్యదర్శి కోటా శ్రీదేవి తదితర నాయకులు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు.