హైదరాబాద్: 28°C
తెలంగాణ

AICC ఇంఛార్జ్‌తో MLA నాగరాజు భేటీ

WGL: ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ బీ.ఎం. సందీప్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం గాంధీభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు.