హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.కోటి పెట్టుబడి మద్దతుకు IITH విద్యార్థుల ఆవిష్కరణలు!

HYD: బిల్డ్ యువర్ భారత్-2026 జాతీయ హ్యాకథాన్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన రెండు విద్యార్థి బృందాలు విజయం సాధించాయి. ఎస్పాడా బృందం గ్రామీణ ప్రాంతాల్లో శ్వాస సంబంధిత వ్యాధులను గుర్తించే కృత్రిమ మేధ పరిష్కారాన్ని రూపొందించగా, రీఫార్మ్ బయో బృందం పనికిరాని పండ్ల వ్యర్థాలతో బయోసెల్యులోజ్ తయారీ విధానాన్ని అభివృద్ధి చేసింది.