MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బాల్య వివాహాలను అరికట్టాలని సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. చట్ట ప్రకారం అమ్మాయి వివాహానికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలన్నారు. చిన్న వయసులో వివాహం చేస్తే అనారోగ్య సమస్యల బారిన పడతారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
‘బాల్య వివాహాలను అరికట్టాలి’


