హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTO కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల నిరసన

GDWL: జిల్లా RTO కార్యాలయం ఎదుట లారీ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. లారీలను కార్యాలయం ముందు నిలిపి రవాణా శాఖ అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. వాహనాలకు స్టిక్కర్లు వేసే పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కారణం లేకుండా జరిమానాలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.