VKB: పెద్దేముల్ మండలం తట్టేపల్లి వద్ద సమయానికి RTC బస్సులు రాకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఉదయం కళాశాలలకు, సాయంత్రం ఇళ్లకు వెళ్లే వేళల్లో బస్సులు లేక చదువులకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వాహనాల వల్ల ఆర్థిక భారం పడుతోందని, తక్షణమే నిర్దిష్ట సమయాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పెద్దేముల్ మండలంలో రోడ్డెక్కిన విద్యార్థులు


