హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోండి: తహశీల్దార్

NGKL: వంగూర్ మండలంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తహశీల్దార్ మురళీమోహన్ శుక్రవారం తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకొని ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2023 నవంబర్ నాటికి డిగ్రీ చేసిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.