హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగా పంచాయతీ భవనం

BHNG: బొమ్మలరామారం మండలం కంచల్‌తండా గ్రామంలో పంచాయతీ నూతన భవన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మంజూరైన నిధులతో స్లాబ్ వేశారు. మిగతా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.