హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో మూగజీవి మృతి

వరంగల్ జిల్లా లైన్ తండాలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామీణ నీటి సరఫరా ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో విద్యుత్ తీగలు తగలడంతో బిజిని ఓదెలకు చెందిన ఎద్దు మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యుడు ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించారు. నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.