ఆదిలాబాద్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఏజెంట్ల ద్వారా మారుమూల గ్రామాల్లో పశువులను కొనుగోలు చేసి, వ్యాన్లు, కంటైనర్లలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వారానికి ఐదు వేలకుపైగా పశువులు తరలుతున్నట్లు సమాచారం. అధికారులు నిఘా పెంచి అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఏజెంట్ల ముసుగులో పశువుల వ్యాపారం


