హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియాకు ఆసిఫాబాద్‌ గిరిజన బాలికలు

ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన గిరిజన బాలికలు ఆత్రం అంజలి, ఆడె నందిని అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటి ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు ఎంపికయ్యారు. అంజలి హ్యామర్‌ త్రోలో, నందిని 400 మీటర్ల పరుగులో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. కోచ్‌ విద్యాసాగర్‌ శిక్షణలో పతకాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.