SRCL: వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వాహనదారులకు ఎస్పీ మహేష్ బి.గితే కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఉంటుందని హెచ్చరించారు. హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాద బాధితులకు PM రహత్ ద్వారా రూ.1.50 లక్షల వరకు వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం: ఎస్పీ


