BDK: భద్రాచలం పట్టణంలో ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో సేవలను శుక్రవారం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఈ సేవలతో భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కలుగుతుందన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ర్యాపిడో నిర్వాహకులు, పాల్గొన్నారు.
తెలంగాణ
భద్రాచలంలో ర్యాపిడో సేవలు ప్రారంభం


