హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష

MNCL: మంచిర్యాల జిల్లాలో శనివారం జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ చంద్రయ్య తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు లక్షెట్టిపేట, చెన్నూర్, మందమర్రి, బెల్లంపల్లిలోని పరీక్షా కేంద్రాలలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే పరీక్షకు 1577 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు.