హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిందితులను అరెస్టు చేయకుంటే నిరాహార దీక్షలు: KVPS

VKB: వికారాబాద్ మండలం సర్పన్ పల్లిలో దసరా నాడు దళితులు, మహిళలు, రైతులపై దాడి చేసిన 15 మందిని 40 రోజులైనా అరెస్టు చేయలేదని బాధితులు ఆరోపించారు. ఫిర్యాదుదారులపైనే కేసులు పెడుతున్నారని, డబ్బున్న వారికి సహకరిస్తున్న డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను అరెస్టు చేయకుంటే నిరాహార దీక్షలు చేపడతామని కేవీపీఎస్, అంబేద్కర్ సంఘం నాయకులు హెచ్చరించారు.