హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మాణ లోపాలతో రహదారిపై అవస్థలు

ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌ మండలం తరోడ(బి) తాత్కాలిక వంతెన వద్ద 353బీ జాతీయ రహదారి నిర్మాణ లోపాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.4.5 కోట్లతో చేపట్టిన పనుల్లో ప్రమాణాలు పాటించకపోవడంతో లారీలు తరచూ నిలిచిపోతున్నాయి. వారం రోజుల్లో ఐదు లారీలు చెడిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. అధికారులు స్పందించి రహదారిని సరిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.